Monday, 9 May 2011

పుట్టేసింది

పాప పుట్టేసింది తెలుసు ఇంకా రక్తమాంసాలు అలాగే ఉన్నాయి
చాలా సంస్కరిస్తే కాని బయట వారు చూడటానికి తగదు
But why should I wait?
I am happy and I share
I will correct the scores of mistakes slowly
But first let me rejoice the birth

పన్నెండు రోజులు లేట్గా ఇవాళ మైండ్ మేటర్స్ ప్రసవం :-)

పురిటి నొప్పులు మొదలయ్యి ఒక రోజు దాటింది 
ఇవేళ సాయంత్రం నాలుగూ ఇరవైకి (భారత కాలమానం) పుట్టి తీరుతుంది అని సిద్ధాంతి గారి ఉవాచ 
మొదటి సంతానం కదా అంటున్నారు మంత్రసానులు 
పేరు mindmattersonline.com అని ముందే ఊరంతా దండోరా వేసేసాను కదా 
పుట్టగానే ఉంగా ఉక్కా అని రెండు భాషల్లో ఏడుస్తుంది మా పాప ఆంగ్లంలో, ఆంధ్రంలో 
వీలు చూసుకు వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి 
ఏదో ఇంత కష్టపడ్డందుకు మాకూ తుత్తి :)

పేరు మరిచిపోకండే
mindmattersonline.com


Tuesday, 26 April 2011

సారి...పుట్టటానికి ఇంకొకటి రెండు రోజులు కావాలి.

నన్ను కనే మంత్రసానుల వలన ఏదో చిన్న ఇబ్బంది
తొమ్మిది మాసాల నుంచి ఎదురుచూస్తున్న రోజు వాయిదా :(
అయితే ఏమయింది లెండి
నానా పాటేకర్ ఒక సినిమాలో అంటాడు
"పైదా హోకే క్యా తీర్ మార్ లియే జనమ్ దిన్ మనా రహే హో" అని
అలా కాదుగా మరి మన పుట్టుక
బహుత్ తీర్ మార్నా బాకీ హై....ఇసీ లియె పూరీ తయ్యారీ సె పైదా హోంగే


చో చారి.
మీ
మైమో
(mindmattersonline.com)

Sunday, 24 April 2011

అల్జిమర్స్ -త్వరలో వ్యాక్సిన్! సొ వాట్? నేనెందుకు సంతోషించాలి?

ఆంధ్రభూమిలో వార్త ఇక్కడ 


అల్జీమర్స్? డిమెన్షియా? నివారణ? 
బుర్ర గోక్కుంటాము కదా ఇలాటి వార్త చదివి.
మనలో ఎంతమందికి అల్జీమర్స్ అంటే  ఏమిటో తెలుసు?
అసలు డిమెన్షియా* అంటే ఏమిటో ఎంతమందికి తెలుసు?


మన దేశంలో అరవై అయిదు ఏళ్లకు మించిన వారిలో మూడు నుంచి ఆరు శాతం (ref 1) వరకు ఉండే ఈ డిమెన్షియా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 

డిమెన్షియా అంటే పెద్దవాళ్ళలో(>65 yrs) వచ్చే వయసుకు మించిన మతిమరుపు అన్నది కొంత తెలుసు కాని దాని వేరే రోగ లక్షణాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?

డిమెన్షియాలో ఆ మతిమరుపు లక్షణాన్ని తీవ్రతరం కాకుండా చేసే యాంటీ డిమెన్షియా మందుల* గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆ వ్యాధి నివారణకు ఉపయోగపడే ఈ ‘బపిన్యూజుమబ్ జాబ్’ అంటే ఏమిటి, ఆ వాక్సిన్ రావటం వలన ఎందుకు మనకు సంతోషం 
కలగాలిలాటివి అర్థమవుతాయి. అవునా?



రెండు రోజులు ఓపిక పట్టండి 
2011 ఏప్రిల్ 27నుంచి 
mindmattersonline.com లో 
చక్కగా మీ భాషలో 


డిమెన్షియా  అంటే ఏమిటి?
యాంటీ డిమెన్షియా మందులు ఏమిటి? 
అన్నది చదువుకోవచ్చు.



మరిచిపోకండి 
2011 ఏప్రిల్ 27నుంచి 
mindmattersonline.com లో 
చక్కగా మీ భాషలో 



* ఈ రంగులో ఉన్న వాటి గురించి మీరు mindmattersonline.com లో మొదటి రోజు నుంచె చదవవచ్చు. 


References

Tuesday, 19 April 2011

ఆత్మహత్య - హానికారకాలు, రక్షణకారకాలు

నేను టైమ్స్ ఆఫ్ ఇండియా తప్ప ఇంకే వార్తాపత్రిక చూడక్కర లేదేమో. నాక్కావాల్సినంత మేత రోజూ ఇక్కడే దొరుకుతోంది వార్త ఇక్కడ చదవండి. ఈ పత్రిక నిజంగా మానసిక వ్యాధుల గురించి అవేర్నెస్ పెంచటానికి రాస్తోందో లేక సర్కులేషన్ పెంచుకునే సెన్సేషనలిజమో తెలీదు కాని ఇతోధికంగా తన వంతు సేవ తానూ చేస్తోంది. హాట్స్ ఆఫ్.


టూకీగా
1. ముప్పై అయిదేళ్ళ స్త్రీ.....చిన్నప్పటినుంచి మానసిక సమస్య
2. ఇరవై ఎనిమిదేళ్ళ స్త్రీ...... సంవత్సరమున్నర నుంచి మానసిక సమస్య
                                  నిన్న భర్తతో గొడవ
3. యాభై అయిదేళ్ళ పురుషుడు.....లివర్ వ్యాధి (దీర్ఘకాలిక బాధ)
4. నలభై ఏడేళ్ళ పురుషుడు.......భార్య తాగటానికి డబ్బివ్వలేదని ;-)
5. ముప్పై ఒక్క ఏళ్ల పురుషుదు....ఆరు నెలల క్రితం భార్య చనిపోవటంతో డిప్రెషన్లో ...ఆరు నెలల పాపను అనాధను చేసి


మామూలుగా ఇక్కడ యూకేలో అయితే ప్రతి ఆత్మహత్యా ప్రయత్నానికీ దాదాపుగా రెండుగంటలు ఆ ప్రయత్నం చేసిన వారిని రకరకాలుగా మేము మళ్ళీ మా ప్రశ్నలతో హింసించనిదె (స్వహాని అసెస్మెంట్ Self harm Assessment అంటాము) ఇంటికి పంపము. ఇక ఎవరైనా మా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే చచ్చినట్టే. కరోనర్స్ హియరింగ్ అని ఒక కోర్ట్ హియరింగ్ ఉంటుంది లెండి!!!!




 ఇక్కడ మనకు తెలిసినంతలో చర్చించుకుందాము


1. ఈ అయిదిట్లో రెండు ఇంపల్సివ్ (Impulsive Acts) చర్యలు  (2, 4 కేసులు)
ఈ ఇంపల్సివ్ చర్యల్లో మనకు మన మీద, మన చర్యల మీద ఉన్న పట్టు తప్పుతుంది. ఆలోచించకుండా చేసేస్తాము.
మందు లేదా మత్తు పదార్థాలు వాడటం వలన ఎక్కువవుతాయి లేదా మానిక్ (Manic)గా ఉన్నప్పుడూ ఎక్కువవతాయి.


2. ఇద్దరు డిప్రెషన్లో ఉన్నారు (2, 4 కేసులు)


3. ఒకరు దీర్ఘకాలిక శారీరిక బాధలలో ఉన్నారు (3 కేసు )


4. తెలిసినంతవరకు ముగ్గురు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు  (1,2, 5 కేసులు)


పైన ఎరుపు రంగులో చూపబడినవి ఆత్మహత్యకు రిస్క్ ఫాక్టర్స్ (హానికారకాలు), రిస్క్ ఇండికేటర్స్ (హాని సూచికలు).


5. ఆరు నెలల పాప ఉండటం మామూలుగా అయితే ప్రొటెక్టివ్ ఫాక్టర్ (రక్షణకారకం) అని గుర్తు. కాని ఇక్కడ బ్రతికున్నది పురుషుడు. పైగా ఒకటే పిల్ల. 1978 బ్రౌన్ & హారిస్ రీసెర్చ్ ప్రకారం వర్కింగ్ క్లాస్ స్త్రీల (ఇంగ్లండులో లెండి మన దగ్గర కాదు) ఆత్మహత్యలను అధిగమించే రాక్షణకారకాల్లో (protective factors) పద్నాలుగేళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది ఉండటం అంటారు.


ఇక్కడ, ఒకతే పాప, పైగా బ్రతికున్నది మగాడు. అందుకే రాక్షణకారి కాలేదేమో?


6. ఒకరికి తాగుడు అలవాటు


7. పైన చెప్పబడిన బ్రౌన్ &హారిస్ రిసేర్చిలో స్త్రీలకు తన బాధ చెప్పుకునే అంతరంగీకులు (Absence of an Intimate Confidante) లేకపోవటం ఆత్మహత్యకు పురిగోలిపే ఒక హానికారకం అని చెప్పారు. ఇక్కడ ఉదంతం చూస్తె అది మగవారికి కూడా వర్తిస్తుంది అని చెప్పవచ్చు కదా?


మీకెవరికైనా పైన చెప్పబడిన హానికారకాలు కనపడితే లేదా మన దేశంలో ఎవరైనా అలాటి వారు మీకు తెలిస్తే


బిఫ్రెండర్స్ .ఆర్గ్ (befrienders.org) వారి ఈ హెల్ప్ లైన్ను ఇవ్వండి
http://www.befrienders.org/helplines/helplines.asp?c2=India


మనదేశంలో మొత్తం ఏనిది రాష్ట్రాల్లో ఈ బిఫ్రెండర్స్ వారి హెల్ప్ లైన్స్ పదకొండు నడుస్తున్నాయి.


వీరు చెప్పే దాని ప్రకారం
ఆత్మహత్యా ఆలోచనలు కనక వస్తే
మీ స్నేహితులు, కుటుంబంతో మాట్లాడండి
మా హెల్ప్లైన్ వారితో మాట్లాడండి
మీ డాక్టర్ గారితో మాట్లాడండి 
ఆలోచించండి
అంతం కాకండి 

Monday, 18 April 2011

సైకియాట్రిస్ట్లము మేము అంత అంటరానివారమా?

ముంజేతులు కోసుకుని, లేక్లో దూకి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
 (టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త ఇక్కడ )


కారణం "ఉద్యోగంలో ఉన్న బాధలు భరించలేకపోతున్నాను"


డిప్రెషన్ రావటానికి కారణాలు ఎన్నో ఉంటాయి
మానసిక, శారీరిక, సామాజిక కారణాలలో సామాజిక ఇబ్బందులు అతి సులువయినవి, అతి కష్టమయినవి


ఈ టెకీ ఆత్మహత్యకు కారణమయిన కారణాలేంటో తెలీవు


కాని ఒకటే ప్రశ్న


కాలు విరిగితే ఆర్థోపెడిక్ దగ్గరకు వెళ్తాము ...... కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది కూడా
కాన్సర్ వస్తే....కొన్ని ఇక నయం చేయలేము అని తెలిసినా.......డాక్టర్ దగ్గరకు వెళ్తాము


కాని మానసిక సమస్యలు వస్తే? ఇదో ఇలా ఎవ్వరికీ చెప్పకుండా, ఏ సహాయం తీసుకోకుండా బలైపోతాము.
ఈ వివక్షకు కారణం?







Saturday, 16 April 2011

డిప్రెషన్లో తన వేలును వండుకు తిన్న న్యూజీలాండర్

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ఇక్కడ 


డిప్రెషన్లో ప్రమాద సూచికలు 
స్వహాని (ఇలా తనకు టాని హాని చేసుకోవటం)
ఆత్మహత్యా ప్రయత్నాలు
ఆత్మహత్యా ఆలోచనలు
భవిష్యత్తు మీద ఆశలేకపోవటం
సైకోసిస్

డిప్రెషన్లో తీవ్రత సూచికలు
ఆత్మహత్య ప్రయత్నాలు
ఆత్మహత్యా ఆలోచనలు
భవిష్యత్తు మీద ఆశలేకపోవటం
సైకోసిస్
కటటోనియా

సైకోసిస్? కటటోనియా?

మీ భాషలో వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
సైకియాట్రిస్ట్ణు అడగాలి అనుకుంటున్నారా?

అవసరం లేదు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి  mindmattersonline.com ఉంటుందిగా.

In English & తెలుగులో......
రెండు భాషల్లో ఏకకాలంలో వచ్చే ఏకైక భారతదేశ సైకియాట్రీ వెబ్ సైట్.